Consultation Locations

#202, 3rd Floor, Above Khazana Jewellery, Ashish My Space, Madinaguda, HYD-50

Mon-Sat: Morning: 8.00 - 10.00am, Evening: 6.00 - 9.00pm Sun: Morning: 8.30-9.30am, Evening: Closed

బి.పి ని ఇంటి వద్దే పరీక్షించుకోవడం ఎలా?

Posted on: 30 Jun 2021

By: Dr Vinoth Kumar

Published in:

Read time:

ఇంటి దగ్గరే రక్త ప్రసరణను పర్యవేక్షించటంలో జీవన వాతావరణం అనేది ప్రమేయం కలిగి ఉంటుంది. ఇది రోగిని చికిత్స లో పాల్గొనేలా చేయడమే కాకుండా వారికి హై బి.పి గురించి మరింత తెలుసుకునేలా చేస్తుంది అదే విధంగా క్రమం తప్పకుండ టాబ్లెట్స్ తీసుకునేలా కూడా ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా వారు తీసుకునే ఔషదాలు బి.పి ని నియంత్రణ లో ఉంచుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా డాక్టర్లు తెలుసుకొనేందుకు ఉపయోగపడుతుంది.

అయితే ఇది ఆసుపత్రి కి వెళ్లకుండా ఉంచే ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఇంట్లో ఉన్నపుడు బి.పి సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, మీ వైద్యున్ని సంప్రదించకుండా టాబ్లెట్స్ వేసుకోవడం మానవద్దు.

బి.పి ని ఇంటి వద్దే పరీక్షించుకోవడం ఎలా?

• అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించబడిన, నమ్మకమైన మరియు సరైన బి.పి మానిటర్ పరికరాన్ని మాత్రమే ఉపయోగించాలి.
• సంవత్సరంలో ఒకసారి బి.పి మెషిన్ ను తీసుకువచ్చి, హాస్పిటల్ లోని బి.పి ఫలితాలతో సరిపోల్చుకోండి.
• బి.పి ని పరీక్షించే 30 నిముషాల ముందు కాఫీ, దూమపానం, వ్యాయామం వంటివి చేయకండి.
• బి.పి ని మానిటర్ చేసేటప్పుడు విశ్రాంతికార స్థితిలో ఉండండి..రెండు పాదాలు నేలకు ఆనుకుని, వీపుకి సపోర్ట్ ఉండే కుర్చీలో కూర్చోండి. కూర్చున్నపుడు కాలు మీద కాలు వేయడాన్ని మానుకోండి.
• బి.పి ని కొలిచే 10 నిముషాల ముందు మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేస్కోండి.
• ఉదయాన్నే టాబ్లెట్స్ వేసుకునే ముందు 1,2 నిమిషాల వ్యవదిలో 2 రీడింగ్స్ తీసుకోండి, సాయంత్రం కూడా అదే విధంగా చేయండి.
• హాస్పిటల్ కి వెళ్లే ప్రతిసారి ఒక వారంరోజుల ముందు నుండి ఇంట్లోనే బి.పి ని చెక్ చేసుకోవడం మంచిది.

ఇంట్లో బి.పి పర్యవేక్షణ కింది సందర్భాల్లో ఉపయోగపడుతుంది:

1. అధిక రక్తపోటు ఉండే రోగులకు
2. బి.పి లేకపోయినా ఉన్నట్టు ఫలితాన్నిచ్చే వైట్ కోట్ హైపరటెన్షన్ ను గుర్తించడానికి
3. బి.పి ఉన్నప్పటికీ లేనట్టుగా ఫలితాలను చూపించే మాస్కడ్ హైపరటెన్షన్ ను గుర్తించడానికి,
4. 3 టాబ్లెట్స్ తో నయం కాని బి.పి ని గుర్తించడానికి
5. పడుకొని లేవడానికి బద్ధకం తో ఇబ్బంది పడే రోగుల కోసం (ముఖ్యంగా బి.పి టాబ్లెట్స్ వాడే వారు )
ఇంటి వద్ద బి.పి ని చెక్ చేసుకోవడం వల్ల పేషెంట్స్ వారి యొక్క చికిత్స లో ఎక్కువగా కట్టుబడి ఉంటారు.

సాధారణంగా ఇంటి వద్ద ఉండాల్సిన బి.పి విలువలు :

సాధారణంగా ఇంటి వద్ద చెక్ చేసుకున్నప్పుడు బి. పి విలువలు 130/80 mmhg కంటే తక్కువ ఉండాలి. 130/80 mmhg కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హై బి.పి గా పరిగణించి, డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

మినహాయింపులు :

ఇంటి వద్ద బి.పి చెక్ చేసుకునే ప్రక్రియ, అసాధారణ గుండె వేగం కలిగిన పేషెంట్స్ కు సూచించదగినది కాదు. ఎందుకంటే, నిద్రలో కలిగే బి.పి హెచ్చుతగ్గులను ఇంటి వద్ద గుర్తించలేము. కేవలం 24 గంటల పర్యవేక్షణ తోనే రాత్రి నిద్ర లో బి.పి పడిపోతుందా అనేది గుర్తుంచగలం.